
శివరాత్రి, తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్ధి సునీల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వారికి అమ్మవారి వస్త్రం, ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం చేశారు. దర్శనంతరం మంత్రి కారుమూరి.. బయటికొచ్చి ఎన్టీవీతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ సింగిల్ గా వస్తారు… పొత్తులు పెట్టుకోరని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్ సిటీలో ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత మాది..
తమపై పోటీ చేసేందుకు ఎన్ని పొత్తులతో వచ్చినా పటాపంచలవుతాయని మంత్రి కారుమూరి ఆరోపించారు. ఇదిలా ఉంటే.. పార్టీలో సీట్లు రాలేదని బాధపడద్దు.. ఇంకా పదవులు ఉన్నాయని జగన్ వాళ్ళకి చెపుతూ ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ మాత్రం వాళ్ళు తమ పార్టీలోకి రావాలని అనుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్ గాది కింద పందికొక్కుల్లా తయారయ్యారని మండిపడ్డారు. మరోవైపు.. వాళ్లు వాలంటీర్ వ్యవస్ధ గురించి అనరాని మాటలు అన్నారని పేర్కొ్న్నారు. ఏదోటి అనకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరని అన్నారు. కాగా.. తణుకులో కూడా రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారని మంత్రి కారుమూరి తెలిపారు.
Read Also: Delhi: రష్యా ఉద్యోగాలపై కేంద్రం కీలక ప్రకటన