Leading News Portal in Telugu

Sai Teja: పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్.. ఇక నుంచి అలానే పిలవాలట!



Sai Dharam Tej Emotional Note

Sai Teja Changes his name to Sai Durga Teja: సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఒకసారి యాక్సిడెంట్ కి గురైన తర్వాత తన పేరులో ఉన్న ధరం పక్కకు తప్పించి సాయి తేజగా చలామణి అవుతున్న ఆయన ఇప్పుడు తన పేరులో మరో కొత్త పదాన్ని యాడ్ చేసుకున్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సాయి తేజ, స్వాతి కలిసి చేసిన ఒక ఇండిపెండెంట్ ఫిలిమ్ ను మీడియా ప్రతినిధులకు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు మేకర్స్.

Gaami: విశ్వక్ గామిపై నెగటివ్ ప్రచారం.. రంగంలోకి బాట్స్?

ఆ తరువాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సాయిధరమ్ తేజ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. తన పేరులో ఒక చిన్న మార్పు జరిగిందని చెబుతూ తన పేరులో తల్లి దుర్గ పేరును యాడ్ చేసుకున్నానని ఆయన వెల్లడించారు. తన తండ్రి పేరు ఎలాగో ఇంటి పేరుతో తనకు సంక్రమిస్తుంది, కానీ తన తల్లిని దూరం చేసుకోవాలనే ఉద్దేశం లేకపోవడంతో తన తల్లి దుర్గ పేరును తన పేరుతో యాడ్ చేసుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఈ సత్య అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిం నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయగా దానికి మంచి అప్లాజ్ వచ్చింది. సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ఈ ఇండిపెండెంట్ ఫిలిం కి దర్శకుడిగా వ్యవహరించారు.