Leading News Portal in Telugu

Srinivasa Rao: టీడీపీ, బీజేపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తారు.. అడ్రస్‌లు వెతుక్కోవాల్సిందే..!



V Srinivasa Rao

Srinivasa Rao: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి.. బీజేపీ అంటే భగ్గుమనే కమ్యూనిస్టు పార్టీలు.. ఇప్పుడు బీజేపీతో టీడీపీ చేతులు కలపడాన్ని తప్పుపడుతోంది.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).. సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు విశ్వాస ఘాతుక పొత్తుగా పేర్కొన్నారు.. ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు ప్రజలకు వెన్నుపోటుగా అభివర్ణించిన ఆయన.. జాతీయ స్ధాయిలో పొత్తులు పొడుస్తున్నాయంటే సంకీర్ణ పరిస్థితులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ గెలుస్తామన్న నమ్మకం కోల్పోయింది.. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు.

Read Also: IND vs ENG: తిప్పేసిన అశ్విన్.. ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో భారత్‌ విజయం! సిరీస్‌ 4-1తో సొంతం

ఇక, కాంగ్రెస్ పార్టీతో మాది రాజకీయ పొత్తు కాదు.. సీట్ల సర్దుబాటు మాత్రమే అని స్పష్టం చేశారు వి. శ్రీనివాసరావు.. తెలంగాణలో సీట్ల దగ్గర కాంగ్రెస్ పార్టీతో విబేధాలు వచ్చాయని గుర్తుచేశారు. మరోవైపు.. ఎన్డీఏలో టీడీపీ చేరితే… లౌకిక పార్టీనా? కాదా? అనే విషయాన్ని ఆ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.. కాంగ్రెస్ జాతీయ స్ధాయిలో కూడా తుడిచిపెట్టుకు పోయిందన్నారు.. ఇక, 2019 తర్వాత బీజేపీపై ప్రజల ఆగ్రహం పెరిగిందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తారు.. ఆ పార్టీలు తర్వాత అడ్రస్ లు వెతుక్కోవాల్సిందేనని జోస్యం చెప్పారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.