
ఎంత పెద్ద చెయ్యి తిరిగిన వంట మనిషి అయిన కొన్నిసార్లు తప్పులు చెయ్యడం సహజమే.. కూరల్లో కొన్నిసార్లు మసాలాలు, కారం, ఉప్పు ఎక్కువ అవ్వడం సహజం.. అలాంటి వారు ఈ టిప్స్ ను ఫాలో అయితే కొత్త రుచిని తీసుకురావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో వెంటనే ఒకసారి తెలుసుకుందాం..
కొబ్బరిపాలు, కొబ్బరి పొడి ఇలా కొబ్బరిని ఏ రకంగా అయినా కూరలో వేయడం వల్ల కూరలో తీపిదనం పెరుగుతుంది. చక్కగా ఉంటాయి. ఇవన్నీ కూడా రుచిని బ్యాలెన్స్ చేయడమే కాకుండా బాడీకి చల్లదనాన్ని అందిస్తాయి…
వేయించిన ఉల్లిపాయాలను కూరలో వెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.. రుచి పెరగడమే కాకుండా అందులోని మసాలాలు బ్యాలెన్స్ అవుతాయి.. టమోటా పేస్ట్ ను వేసుకున్నా కూడా రుచి సరిగ్గా సరిపోతుంది.. ఇది పుల్లగా ఉంటాయి కదా..
పెరుగు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. స్పైసీ ఫుడ్లో వీటిని వేస్తే గ్రేవీ పెరగడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది.. కాసేపు కలుపుతూ ఉంటే రుచి అదిరిపోతుంది..
కొత్తిమీర ముక్కలుగా కట్ చేసి కూరల్లో వేయండి. కాస్తా సిమ్లో పెట్టి ఉడికించండి… మసాలా ఘాటు అనేది తగ్గుతుంది.. అంతేకాదు ఆలును ఉడికించి వేసినా మంచి టేస్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. నట్స్ని కూడా నానబెట్టి మరీ ముఖ్యంగా జీడిపప్పు, బాదంపప్పును పేస్ట్ లాగా చేస్తే మంచి రుచి వస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.