
భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) క్షమాపణ కోరారు. భారతదేశం పట్ల మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్స్ బాయ్‌కట్ కారణంగా మాల్దీవులకు (Maldives) పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఆయన తెలిపారు.
ప్రధాని మోడీ లక్ష్యదీప్‌లో పర్యటించి.. భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. విషం చిమ్మే వ్యా్ఖ్యలు చేశారు. దీంతో భారతీయులు.. మాల్దీవుల పర్యటనను బహిష్కరించారు. అనంతరం ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జు సస్పెండ్ చేశారు.
తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల పక్షాన.. భారతీయులకు క్షమాపణ కోరుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా మాల్దీవుల ప్రజలు కూడా భారతీయుల రాకను స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే మాల్దీవులను బహిష్కరించడంతో భారీగా భారతీయ పర్యాటకుల సంఖ్య పడిపోయింది. దీంతో నషీద్ మాట్లాడుతూ.. సెలవులకు మాల్దీవులు రావాలంటూ భారతీయులకు ఆయన పిలుపునిచ్చారు.