Leading News Portal in Telugu

Passenger Train: ఏపీలో తప్పిన ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు



Train

ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం టు భవానీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. లోకో పైలట్ ఎం.హెచ్.ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరగా.. గంట వ్యవధిలోనే కొత్తవలస రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. కొత్తవలస రైల్వే స్టేషన్ ఫ్లాటుఫారం నెంబర్ 5 నుండి బయలుదేరిన రైలు.. రెండో నంబరు లైన్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది.