Leading News Portal in Telugu

DK Aruna : నారీశక్తి ఏంటో నిరూపించాలి



Dk Aruna

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు అంతా నారీశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మహిళా మోర్చ కార్యాచరణను వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కొని తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఆయా రంగాలలో… వారు చేస్తున్న సేవలను ఈ సందర్బంగా కొనియాడారు డీకే అరుణ. బీజేపీ గెలుపులో నారీ శక్తిని నిరూపించాలన్నారు డీకే అరుణ. మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశలో దేశంలో మోడీ పాలన సాగుతోందని, 33% రిజర్వేషన్ తో భవిష్యత్ లో మహిళలకు రాజకీయాల్లో సమూచిత స్థానం రాబోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే మహిళలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాకుండా..’ తెలంగాణ లో 12 సీట్లు గెలవబోతున్నాం. మహిళలను మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం లోని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించినపుడే దేశం పురోభివృద్ధి సాధ్యం అవుతుందన్న మోదీ నమ్ముతున్నారు. అందుకే కేంద్రంలోని మోదీ కేబినెట్ లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో మగవాళ్ల కంటే ఎక్కువగా మహిళలు కుటుంబ పోషణలో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ చదువుకోవాలి అని మోదీ ప్రభుత్వం భేటీ పడవో భేటీ బచావో కార్యక్రమం తీసుకొచ్చింది. ముద్ర లోన్స్ ఇచ్చి డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తున్నది బీజేపీ ప్రభుత్వమే. గ్రామీణ ప్రాంత మహిళల గురించి అలోచించి కట్టెల పొయ్యి కష్టాలను తీర్చి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వమే. దేశ అత్యునత పదవిలో రాష్ట్రపతిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపతి మూర్ముకు అవకాశం ఇచ్చారు అంటే.. అదీ మోదీ మహిళలకు ఇస్తున్న గౌరవం. ఇచ్చిన మాట ప్రకారం 500 ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య లో భవ్య రామ మందిరం నిర్మించిన ఘనత మోడీ. రామరాజ్య స్థాపనలో ముందడుగు వేసిన మోదికి మహిళలు అంతా అండగా నిలవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా మోర్చా నేతలు అంకిత భావంతో పనిచేసి పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలి.’ అని డీకే అరుణ అన్నారు.