Leading News Portal in Telugu

Narakasura: ఓటీటీలోకి వచ్చేసిన నరకాసుర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?



Whatsapp Image 2024 03 10 At 10.09.13 Pm

‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం గతేడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ నావో అకోస్టా దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు..ప్రమోషన్లు కూడా అంతగా జరగకపోవటంతో ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. కాగా, ఇప్పుడు ఈ నరకాసుర మూవీ ఓటీటీలోకి సడెన్‍గా వచ్చేసింది. అయితే, ఓ ట్విస్టుతో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఈ సినిమా రెంటల్ బేసిస్‍లో స్ట్రీమింగ్‍కు రావడం ట్విస్టుగా ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నరకాసుర చిత్రం రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అంటే ప్రైమ్ వీడియో సబ్‍‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లు కూడా ఈ చిత్రాన్ని చూడాలంటే ప్రస్తుతం రూ.79 రెంట్ చెల్లించాలి. స్టార్ హీరోల సినిమాలే సాధారణంగా స్ట్రీమింగ్‍కు వస్తుంటే.. నరకాసుర మాత్రం రెంటల్ విధానంలో స్ట్రీమ్ అవుతుంది.అయితే, కొద్ది రోజుల తర్వాత ఈ చిత్రం అందరికీ ఉచితంగా రెంటల్ లేకుండా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది.

నరకాసుర చిత్రంలో రక్షిత్ అట్లూరి హీరోగా చేయగా.. అపర్ణా జనార్దన్, సంగీతా విపిన్, శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమన్,తేజ్ చరణ్‍రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. సెబాస్టియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాఫర్ రాజా సంగీతం అందించారు. అజ్జా శ్రీనివాస్ మరియు కురుమారు రఘు ఈ చిత్రాన్ని నిర్మించారు.నరకాసుర సినిమా యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామంలో శివ (రక్షిత్ అట్లూరి) నివసిస్తుంటాడు. కాఫీ, మిరపను తరలించే లారీ డ్రైవర్‌గా అతడు పని చేస్తుంటాడు. అక్కడి ఎమ్మెల్యే నాగమ నాయుడు (చరణ్ తేజ)కు విధేయుడిగా శివ ఉంటాడు. ఎమ్మెల్యే చెప్పిన పనులు చేస్తుంటాడు. గొడవలకు దిగేందుకు కూడా వెనుకాడడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమారుడు ఆది నాయుడు (తేజ చరణ్ రేజ్)తో శివకు గొడవ అవుతుంది. ఆ తర్వాత సడెన్‍గా శివ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళతాడు. ఆ తర్వాత అస్సలు ఏమైంది? శివ ఏమయ్యాడు? శివ, ఆది మధ్య గొడవకు కారణమేంటి? మళ్లీ శివ తిరిగొచ్చాడా? ట్రాన్స్‌జెండర్లకు ఈ కథతో సంబంధం ఏంటి? అనేదే నరకాసుర మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.