
మునుపెన్నడు లేని విధంగా రికార్డులు తిరగరాస్తు 50 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు మహిళలు కాకర్ల సురేష్ కు భరోసా ఇచ్చారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ మహిళలు ముస్లిం సోదరులు సుమారు 500 మంది టిడిపి పార్టీలో ఉదయగిరి ఇంచార్జ్ కాకర్ల సురేష్ సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ.. 50వేల మెజార్టీ మెజారిటీతో ఉదయగిరి పై తెలుగుదేశం జెండా ఎగరవేస్తామన్నారు. వారికి ప్రధానంగా ఉన్న సమస్యలను కాకర్ల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా త్రాగునీరు రోడ్లు విద్యుత్ దీపాలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం కాకర్ల మాట్లాడుతూ.. నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటానని తెలిపారు. మనందరి భరోసా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటేనే సాధ్యమవుతుందన్నారు. 13వ తేదీ నుండి సీతారాంపురం చిన్న నాగంపల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయగిరి రియాజ్ ఆధ్వర్యంలో ఇంతమంది నాకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే మీ అందరిని కలుసుకుంటానని మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన నాడే కుటుంబాలు బాగుపడతాయని దానికోసం పాటు పడతానన్నారు. ఉదయగిరి నాయకులు పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ మన్నేటి వెంకటరెడ్డి బయన్నల ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలో త్వరలో పార్టీ కార్యాలయం అందరికీ అనువైన స్థలంలో ఏర్పాటు చేస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి జీవన ప్రమాణాలు మారుస్తానని కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమణులు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.