
రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని, రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు గల కూరగాయల వేలం మార్కెట్ నందు,ఎద్దుల మార్కెట్ యందు, మేకల బజార్ లో తిరిగి బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పై ప్రచారం నిర్వహించారు. రైతులను కలుసుకొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, బాధలను విన్నారు. పల్లెలు కరువు కోరల్లో చిక్కుకొని వలసలు బాట పట్టారని, పశుగ్రాసం లేక పశువులను కమేళ్ళాలకు విక్రయిస్తున్నామని ఓ రైతు ఆవేదన తో డా. మాచాని సోమనాథ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మరో రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు శరణ్యంగా మారాయని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ.. జగన్ రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలం చెందారని ధనయజ్ఞమే ధ్యేయంగా ఉండడంతో జల యజ్ఞాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
పశ్చిమ ప్రాంత రైతులకు జీవనాడి అయిన ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం నకు చంద్రబాబు నాయుడు తన హాయంలో వేలకోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే జగన్ పనులు ప్రారంభించక నిర్లక్ష్యం వహిస్తూ రైతులకు తీరని అన్యాయం చేశారని దుయ్య పడ్డారు. పెండింగు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే చంద్రన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఇందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు, చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇప్పె నరసప్ప, తెలుగు మహిళ నాయకురాలు గోకారమ్మ,రోజా ఆర్ట్స్ ఉసేని, కే.ఎం.డి.అబ్దుల్ జబ్బర్, కంపాడు చిన్న రంగన్న, మైనార్టీ నాయకులు గోరా భాష, జోహార్ అబ్బాస్, ఆఫ్గాన్ వలి భాష, మాసుమాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, ధన తదితరులు పాల్గొన్నారు.