Leading News Portal in Telugu

Gaami: యూఎస్ఏలో అదరగొడుతున్న గామి.. సరికొత్త రికార్డ్ ను అందుకున్న విశ్వక్..



Viswak (2)

ఇటీవల చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ ను అందుకుంటున్నాయి.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సినిమా కూడా దూసుకుపోతుంది.. టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్.. దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ సినిమా కోసం అతడు ఆరేళ్లుగా పని చేశాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు..

ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది.. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అదరగొడుతుంది.. ఇక టీజర్, ట్రైలర్స్ గామి సినిమా అంచనాలు పెంచగా మొదటి షో నుంచే ప్రేక్షకులని మెప్పించింది. ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంగా, హాలీవుడ్ విజువల్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఈ రేంజ్ విజువల్స్ సినిమాని తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారు.. ఈ సినిమా ప్రస్తుతం వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ రెండో రోజు కలెక్షన్స్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే..

ఇప్పటివరకు ఈ సినిమా రెండో రోజే 15.01 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక అమెరికాలో కూడా కలెక్షన్స్ దూసుకుపోతుంది.. ఈ చిత్రం ప్రీమియర్స్ గ్రాస్ తో పాటు మొదటి 2 రోజుల్లో $400K కంటే ఎక్కువ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన “శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్”కు యుఎస్ఎ, కెనడా ప్రేక్షకుల నుండి అపూర్వమైన స్పందన లభించింది. వీకెండ్ నాటికి “గామి” $ 500K మార్కును దాటడానికి సిద్ధంగా ఉంది.1 మిలియన్ డాలర్స్ కి దూసుకుపోతుంది.. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. మొత్తానికి సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది..