
CPI Ramakrishna: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా.. టీడీపీ, జనసేన, బీజేపీలు ( TDP- Janasena- BJP ) కలిసి పోటీ చేసి ఎంపీగా గెలిచినా అందరూ మోడీకే ఓట్లేస్తారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ఆరోపించారు. ఢిల్లీలో అందరూ జంతర్ మంతర్ దగ్గర కలుసుకుని నేరుగా వెళ్లి మోదీకే ఓట్లేస్తారు అని పేర్కొన్నారు. పదేళ్లుగా చూసిన రాజకీయంలో ఇక్కడ ప్రత్యర్ధులుగా ఉంటారు.. ఢిల్లీ వెళ్తే మిత్రులుగా మారిపోతారు అని ఆయన చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ పదేళ్లలో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఇక్కడ మాట్లాడుతారు తప్ప అక్కడ మాట్లాడరు.. లోక్ సభ, రాజ్యసభలో టూ థర్డ్ మెజారిటీ వస్తే బీజేపీ వాళ్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చి వేస్తారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరు తమ మాట వినకపోయినా కేసులు బనాయించి జైళ్లలో పెడతామని బెదిరిస్తున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు.
Read Also: Tirupati: అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలంటూ తిరుపతిలో మైనర్ బాలికపై స్వామిజీ లైంగిక దాడి
చంద్రబాబును బెదిరించి లొంగదీసుకున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) తెలిపారు. చంద్రబాబు (Chandrababu)ను జగన్ ( jagan ), మోడీ ( modi), అమిత్ షా పథకం ప్రకారం జైలుకు పంపారు..దేశంలో బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తుంది.. ఆర్ఎస్ఎస్ (RSS) విధానాలను అమలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.. మోడీని గద్దె దింపటానికి ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది అని ఆయన పేర్కొన్నారు. జగన్, చంద్రబాబు పోటీలు పడి మరీ మోడీకి మద్దతు ఇస్తున్నారు.. మోడీ అంటే భయంతో ఇద్దరూ మద్దతు ఇస్తున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.