posted on Mar 11, 2024 2:40PM
యాదాద్రిలో లక్ష్మినరసింహాస్వామిని దర్శించుకున్న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంజిల్లాలోని భధ్రాచలం రాములవారిని దర్శించుకున్నారు. ఈ జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రస్తుత కేబినెట్లో ఉన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ముఖ్యమంత్రికి స్వాగతించిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వాగతం పలికారు. ఆలయ ఈవో, పండితులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.