
Daggubati Purandeswari: ఢిల్లీ స్థాయిలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులు కుదిరాయి.. ఇక, రాష్ట్రస్థాయిలో చర్చలు ప్రారంభం అయ్యాయి.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పొత్తులపై మాకొక ప్రొసీజర్ ఉంటుందన్నారు.. మా విధానంలో భాగంగా కేంద్ర మంత్రి.. రాష్ట్రానికి వచ్చినట్టు వెల్లడించారు.. కేంద్రమంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, జయంత పాండా, నాదెండ్ల మనోహర్ చర్చలు జరుగుతుండగా.. షెకావత్-టీడీపీ-జనసేనతో చర్చించిన తరువాత నిర్ణయం వస్తుందన్నారు. అయితే, నేను సీట్ల విషయంలో ప్రామిస్ లు ఎప్పుడూ చేయను అని స్పష్టం చేశారు.. మా సిద్ధాంతాలు, క్రమశిక్షణ అనుకూలంగా వచ్చిన వారు కలుస్తారని వెల్లడించారు.. ఇక, వైసీపీ ఎంఎల్ఏ వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని పేర్కొన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
Read Also: Siddhu Jonnalagadda: స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. లీక్ చేసేసిన సోదరుడు!
కాగా, ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాద్.. వైసీపీకి రాజీనామా చేసిన వరప్రసాద్.. ఇటీవలే జనసేనాని పవన్ కల్యాణ్‌ని కలిశారు.. అయితే, రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు అనంతరం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.. దీంతో ఈ రోజు ఆయన పురంధేశ్వరితో సమావేశం అయ్యారు.. పొత్తు అనంతరం బీజేపీ నుంచి తిరుపతి లోక్‌సభ సీటును ఆశిస్తున్నారట వరప్రసాద్.. అంతేకాదు.. గతంలో తిరుపతి ఎంపీగా వైసీపీ తరఫున గెలిచారు వరప్రసాద్.. ఇక, తిరుపతి పార్లమెంటు పరిధిలో వరప్రసాద్ కు ఉన్న బలం.. బలగం పై పురంధేశ్వరి, బీజేపీ ఎన్నికల సమన్వయకర్త శేఖర్ జీతో చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.