Leading News Portal in Telugu

Shopping Malls : మాల్స్‌లోని వాష్రూమ్స్ కు కస్టమర్స్ నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?



Biggest Malls In India

సమ్మర్ రాకముందే ఎండలు భగ భగ మండిపోతున్నాయి.. అప్పుడే ప్రముఖ నగరాల్లో నీటి కొరత, కరెంట్ కోతలు మొదలైయ్యాయి.. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా కర్ణాటక బెంగళూరులో నీటి కష్టాలు మొదలు అయ్యాయి. ఎండలు ముదరకుండానే మంచి నీటి కోసం కటకట మొదలైంది.. రోజు రోజుకు నీటి కష్టాలు పెరిగిపోతున్నాయి.. ఈ క్రమంలో నగరంలోని షాపింగ్ మాల్స్ లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. వాహనాలను కడగడం వంటివి చేస్తే భారీ జరిమానా చెల్లించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..

కేవలం తాగు నీటికే కాకుండా స్నానాలకు, ఇతర అవసరాలకు నీటి సమస్య ఏర్పడటంతో చాలా మంది పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లకు వెళుతున్నారు. షాపింగ్ పేరుతో వాటిల్లోని వాష్ రూంలో కాలకృత్యాలు, స్నానాలు చేసి వస్తున్నారట.. దాంతో మాల్స్ లో జనాల రద్దీ పెరిపోయిందట.. ఇక చేసేదేమి లేక షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు.. మాల్స్ లోని వాష్రూమ్స్ దగ్గర నో ఎంట్రీ బోర్డులు దర్శనమిస్తున్నాయట. కస్టమర్లను వాష్ రూమ్స్ లోకి వెళ్లనియకుండా వాటిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక చేసేదేమి లేక వెనక్కి వెళ్తున్నారట..

వేసవికాలం ఇంకా రాకముందే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక ముందు ముందు ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. నగరంలో నీటి కొరత ఎక్కువగా ఉండటంతో జనాలు ట్యాంకర్ ను ఆశ్రయిస్తున్నారు.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ట్యాంక్ వాటర్ రూ. 800 వరకు పలికితే.. ఇప్పుడు రెండు వేల రూపాయలను పెట్టాల్సి వస్తుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.. ఎండలు పెరిగే కొద్ది అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి రావచ్చునని అధికారులు చెబుతున్నారు..