Leading News Portal in Telugu

Vande Bharat Train : వరంగల్ మీదుగా మరో వందేభారత్



Vande Bharat Express

వరంగల్ మీదుగా మరో వందేభారత్ ప్రారంభం కానుంది. వరంగల్ మీదుగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం నుంచి నడవనుంది. దీనిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా సికింద్రాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల వరకు విశాఖపట్నంకు వందే భారత్ ట్రైన్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాగా.. ఇది తెలంగాణ నుండి నాల్గవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. మార్చి 12 న సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ఫ్లాగ్ చేయడంతో తమ కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయి.

ఈ రైలు ఆరు రోజులు (గురువారాలు మినహా) సాధారణ సర్వీసుతో మార్చి 13 నుండి విశాఖపట్నం -సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్య మార్చి 15 నుండి ప్రారంభమవుతుంది. రైలు నంబర్ 20707. సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ నుండి ఉదయం 5.05 గంటలకు బయలుదేరి విశాఖపట్నం మధ్యాహ్నం 1.50 గంటలకు చేరుకుంటుంది.

రైలు నంబర్ 20708 విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం రుకుంటుంది, ఈ రైలు రెండు దిశలలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది.

ఈ రైలులో ఏడు AC చైర్ కార్ కోచ్‌లు మరియు ఒక ఎగ్జిక్యూటివ్ AC చైర్ కార్ కోచ్ 530 మంది ప్రయాణీకులను కలిగి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైలు 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోందని ఆదివారం అధికారిక ప్రకటన తెలిపింది.