Leading News Portal in Telugu

జగన్ పార్టీ దేనికి సిద్ధం? | ycp ready for what| confusion| party| jumpings| tickets| constituency| changes


posted on Mar 12, 2024 9:34AM

సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ పరిస్థితి చూస్తే.. ఆ పార్టీ నిజంగానే ఎన్నికలకు సన్నద్ధమౌతోందా, లేదా ఓటమిని అంగీరించేసి చేతులెత్తేయడానికి సిద్ధం అయిపోయిందా అన్న అనుమానం కలగక మానదు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబీతాలను  వరసగా విడుదల చేస్తూ, మార్చిన వాటినే మారుస్తు, అసలు ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి నిలబడతారు అన్న క్లారిటీ లేకుండా ఆ పార్టీ అధినేత చేస్తున్న విన్యాసాలు వైసీపీ నాయకులనే కాదు, శ్రేణులను సైతం నైరాశ్యంలో ముంచేస్తున్నాయి. 

ఇప్పుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ లు అంటూ ప్రకటించినా, చివరకు అభ్యర్థిగా వారినే ప్రకటించి బీఫారం ఇస్తారా అన్న అనుమానాలు జాబితాలో పేర్లు ఉన్నవారిలోనే వ్యక్తం అవుతున్నాయి. ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వనుంది. ఇప్పటికీ అధికార వైసీపీలో అభ్యర్థుల గందరగోళం అలాగే ఉంది. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొందరు కేబినెట్ మంత్రులు పోటీ చేసే నియోజకవర్గాలేమిటన్నది కూడా ఇప్పటికీ తేలలేదు.

కొందరైతే టికెట్ ఇచ్చినా పోటీ చేయలేం మహప్రభో అని జగన్ కు ఓ దణ్ణం పెట్టి ఊరుకుంటున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి శిబిరం మాత్రం నిబ్బరంగా తన పని తాను చేసుకుపోతున్నది. పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు, సమన్వయంతో సమష్టి ప్రచార వ్యూహాలు, ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన వంటి అంశాలన్నిటినీ సాఫీగా చేసుకుంటూ పోతున్నది. అందుకు భిన్నంగా అధికార పార్టీలో మాత్రం అయోమయం, గందరగోళం, అసంతృప్తి, నిరసనలు అట్టుడుకుతున్నాయి.  

వీటికి తోడు వరుసగా వెలువడుతున్న సర్వేలన్నీ ప్రతికూలంగా ఉండటంతో జగన్ పార్టీలో వణుకు మొదలైంది. మేకపోతు గాంభీర్యం పదర్శిస్తూ సిద్ధం సభలు నిర్వహించినా, సొమ్ము, మద్యం సరఫరా చే సినా జన సమీకరణ అనుకున్నంతగా చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ఉంది. దీంతో ఇప్పటికే మొదలైన వలసలు.. షెడ్యూల్ విడుదల తరువాత మరింత జోరందుకుంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.