Leading News Portal in Telugu

Geetanjali Incident: గీతాంజలిది ఆత్మహత్య కాదు.. వాళ్లు చేసిన హత్యే..!



Vasireddy Padma

Geetanjali Incident: తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం ఇప్పు్డు రాజకీయాలకు పనిచెప్పింది.. ఈ రోజు గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ఈ సందర్భంగా ఏపీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. గీతాంజలిది ఆత్మహత్య కాదు.. టీడీపీ, జనసేన సోషల్ మీడియాలు చేసిన హత్యగా పేర్కొన్నారు. గీతాంజలి ప్రభుత్వానికి ఒక స్టార్ క్యాంపైనర్.. అందుకే ప్రభుత్వానికి స్టార్ కాంపైనర్ గా మారిన మహిళను గొంతు నొక్కేశారని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న మంచి చెప్పకూడదు.. అనే దుర్బుద్ధితో టీడీపీ నాయకులు ఈ పని చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాను ఉసిగొల్పి పశువుల్లా ప్రవర్తిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Read Also: Donald Trump: టిక్‌టాక్‌పై మారిన ట్రంప్ స్వరం.. ఉద్దేశమేంటంటే..!

ఇక, చివరకు మంత్రిగా పనిచేస్తున్న రోజాను కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వాసిరెడ్డి పద్మ.. జగన్మోహన్ రెడ్డి సైనికులను ,స్టార్ కాంపైనర్ లను టార్గెట్ చేసి చంద్రబాబు నేతృత్వంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.. ప్రభుత్వం చేసిన మంచి పనులు నాలుగు మాటలు మాట్లాడితే ఇలాంటి దాడులు చేస్తారా..? అని నిలదీశారు. ఈ పన్నాగాలను తిప్పి కొడతాం.. సామాన్యమైన మహిళల మీద రాజకీయ కుట్రలు చేస్తున్నారు.. మీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు అర్థమవుతుంది.. రాష్ట్ర డీజీపీతో మాట్లాడి టీడీపీ, జనసేన నాయకులకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. మరోవైపు.. సోషల్ మీడియా కుక్కలు మాట్లాడిన, మాటలకు మహిళలు కుంగి పోవద్దు మానసికంగా ధైర్యంగా ఉండండి.. టీడీపీ, జనసేన సోషల్ మీడియాలపై మహిళలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు వాసిరెడ్డి పద్మ.