
Sarathkumar merges his party AISMK with BJP: సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు శరత్ కుమార్ ప్రకటించారు. ఈరోజు (మార్చి 12) ఆలిండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఆర్.శరత్‌కుమార్ ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని, వి యువతకు, ప్రజలకు మేలు జరిగేలా ఈ విలీనం చేస్తున్నానని ఆయన ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శరత్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొంటామని శరత్‌కుమార్ గత వారమే ప్రకటించారు. 2007లో ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించిన శరత్‌కుమార్ 2011లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యారు. ఇక తమిళనాడులో బీజేపీ నాయకత్వం కొత్త టీమ్‌ని ఏర్పాటు చేసి పనిలో నిమగ్నమై ఉండగా, గత వారం కేంద్రమంత్రి ఎల్.మురుగన్, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా, బీజేపీ తమిళనాడు ఇంచార్జ్ అరవింద్ మీనన్‌లు శరత్‌కుమార్‌తో సమావేశమై ఒక కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ అనారోగ్యం.. పుష్ప 2కి బ్రేకిచ్చి హైదరాబాద్ కి ?
ఆరోజే నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని శరత్‌కుమార్ ప్రకటించారు. ఈ క్రమంలో ఈరోజు (మార్చి 12) చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో శరత్‌కుమార్ తన ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇక ఈ విలీన కార్యక్రమానికి బీజేపీ అగ్రనేత అరవింద్ మీనన్ కూడా హాజరయ్యారు. విలీనం అనంతరం శరత్‌కుమార్ మాట్లాడుతూ.. భావి యువత, దేశ ప్రయోజనాల కోసమే పార్టీని బీజేపీలో విలీనం చేశానన్నారు. అలాగే శరత్‌కుమార్ మాట్లాడుతూ.. ఇది పార్టీ అంతం కాదని, తిరుగుబాటుకు నాంది అన్నారు. ఈ విలీనంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. శరత్‌కుమార్ దేశానికి అవసరమని, ఆయనను కేవలం తమిళనాడుకే పరిమితం చేయకూడదని.. శరత్‌కుమార్ తమిళనాడుకు ప్రతీక అన్నారు. బీజేపీలో చేరిన శరత్‌కుమార్‌కు వచ్చే లోక్‌సభ నియోజకవర్గంలో టిక్కెట్ ఇస్తారనే అంచనాలు ఉన్నాయి.