posted on Mar 13, 2024 2:52PM
హైదరాబాద్ నగరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు తీసుకురాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దూసుకుపోయినప్పటికీ రాజధానిలో కాంగ్రెస్ చతికిలపడిపోయింది. వెంగళరావ్ నగర్ జూబ్లిహహిల్స్ నియోజకవర్గం పరిధిలో వస్తుంది. సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గత ఎన్నికల్లో గెలుపొందారు. వెంగళ రావ్ నగర్ కార్పోరేటర్ కూడా బిఆర్ఎస్ అభ్యర్థి. మాజీ రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ వర్గీయులు ఆమెపై దాడి చేయడం సంచలనమైంది. ప్లెక్సీ వివాదం ఈ దాడికి దారి తీసింది. హైదరాబాద్లోని వెంగళరావునగర్లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యారావు, ఆమె భర్తపై గతరాత్రి కొందరు గుర్తు తెలియని మహిళలు దాడిచేశారు. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను ఆమె ఆదేశించడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేత మద్దతుదారులైన మహిళలు వెంగళరావునగర్ చేరుకుని ఆమెతో వాగ్వివాదానికి దిగారు. అప్రమత్తమైన దేదీప్యారావు మద్దతుదారులు అక్కడకు చేరుకోవడంతో గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు భౌతికదాడికి దిగాయి. ఈ గొడవతో కారు నుంచి కిందకు దిగిన కార్పొరేటర్పైనా మహిళలు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.