
కరాచీ కింగ్స్‌తో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజాంకు ఒక విచిత్ర సంఘటన ఎదురైంది. కరాచీ కింగ్స్ ఛేజింగ్ ప్రారంభానికి ముందు బాబర్ ఫీల్డింగ్ కి వెళుతున్నప్పుడు రోవ్మాన్ పావెల్ అతని పక్కన నడుస్తూ వ్యాఖ్యాతలతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బాబర్ ఆజం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు.. అయితే, స్పైడర్ క్యామ్ ఒక్కసారిగా కదలడంతో అతడు భయపడిపోయాడు.
Read Also: AP Highcourt: ఇసుక ధర పసిడితో పోటీ పడుతోందని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..!
కాగా, పెషావర్ జల్మీ 2 పరుగుల తేడాతో కరాచీ కింగ్స్‌ను ఓడించి PSL ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కెప్టెన్ బాబర్ 46 బంతుల్లో 51 పరుగులు చేయగా జట్టు స్కోరు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇక, కరాచీ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 145 పరుగులే చేసింది. అయితే, బాబర్ ఆజం 2023 వన్డే ప్రపంచ కప్ నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్ లేమీతో ఇబ్బంది పడుతున్న సమయంలో అతను తన పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీని కోల్పోయాడు.
Read Also: Venu Swami : సలార్ ఫ్లాప్.. వేణు స్వామి చెప్పింది నిజమే?
ఇక, పాకిస్తాన్ మాజీ క్రికెట్ డైరెక్టర్ ముహమ్మద్ హఫీజ్, మాజీ కెప్టెన్, బాబర్ ఆజంతో పాటు కోచ్‌లు మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ భారతదేశంలో ODI ప్రపంచ కప్‌కు ముందు జట్టు ఫిట్‌నెస్‌కు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. అప్పటి కెప్టెన్ బాబర్ నేతృత్వంలోని పాకిస్తాన్ నాకౌట్ రౌండ్‌కు చేరుకోవడంలో విఫలమైంది. ఆడిన తొమ్మిది లీగ్ మ్యాచ్ లలో ఐదింటిని ఓడి ఐదో స్థానంలో నిలిచింది.
such a kid
pic.twitter.com/GfcHGicVzS
— abdullah. (@babarcoded) March 11, 2024