Leading News Portal in Telugu

Pakistan: రంజాన్ నేపథ్యంలో పైలెట్లు, విమాన సిబ్బందికి పాకిస్తాన్ కీలక ఆదేశాలు.



Pia

Pakistan: ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ జాతీయ ఎయిర్ లైన్స్ ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)’ తమ పైలెట్లు, క్యాబిన్ క్రూకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ సమయంలో ఉపవాసాలు ఉన్న పైలెట్లు, విమాన సిబ్బంది విమానాల్లో విధులు నిర్వర్తించొద్దని చెప్పింది. విమానంలో ప్రయాణిస్తు్న్నవారు, నేలపై ఉన్న వారి ప్రాణాలకు హాని కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉపవాస సమయాల్లో డీహైడ్రేషన్, సోమరితనం, నిద్రను ఎదుర్కొంటారని అలాంటి సందర్భా్ల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే వైద్య సిఫారసులతో పీఐఏ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Paytm : థర్డ్ పార్టీ యూపీఏ ఉపయోగించేందుకు ఆమోదం పొందిన పేటీఎం

అందువల్ల పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది తమ ఆన్-డ్యూటీ సమయంలో అంతర్జాతీయ, డొమెస్టిక్ విమానాల కోసం ఉపవాసం ఉండకూడదని ఆదేశించింది. పైలట్ లేదా సిబ్బంది ఎవరైనా ఉపవాసం ఉంటే విమానం ఎక్కేందుకు అనుమతించబోమని పీఐఏ స్పష్టం చేసింది. మే 2020లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కి సిద్ధమవుతున్న పీఐఏ విమానం మానవ తప్పిదంతో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్లతో సహా 101 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని నివేదిక వచ్చిన నెల తర్వాత పీఐఏ ఈ నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసంలో డ్యూటీలో ఉన్నప్పుడు పైలట్లు ఉపవాసం ఉండాలా వద్దా అనే దానిపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడానికి PIA మరియు సివిల్ ఏవియేషన్ అథారిటీ బాధ్యత వహించాలని నివేదిక పేర్కొంది.