Leading News Portal in Telugu

Dr. Mallu Ravi: బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు.. అన్ని కాంగ్రెస్ గెలుస్తుంది..!



Mallu Ravi

Dr. Mallu Ravi: బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు,.. అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజలు తెలంగాణ మోడల్ పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ మోడల్ అంటే ఆరు గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ, కులసంఘాలకు కార్పొరేషన్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలని తెలిపారు. బీజేపీ నాయకులు చెప్పినట్లుగా గుజరాత్ మోడల్ పాలన కోరుకోట్లేదన్నారు. తెలంగాణలో ప్రజలు 200 ఉచిత యూనిట్ల కరెంట్, 10లక్షల భీమా, ఇందిరమ్మ ఇండ్లు, బుసులలో ఉచిత ప్రయాణం కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

Read also: Bandi Sanjay: నన్ను గెలిపిస్తే.. నేను వెళ్లి మోడీకీ ఓటేస్తా..!

ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను మెప్పించడం చేతకాక బీజేపీ నాయకులు మీడియాలో మాట్లాడుతున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తామని పగటి కలలు కంటుందని తెలిపారు. 2019 లో గెలిచిన 4 సీట్లు కూడా ఈసారి గెలవదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు.. అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపారు. దేశంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమన్నారు.
Komatireddy Venkat Reddy: బీఆర్‌ఎస్‌ లో మిగిలేది ఆ నలుగురే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు