
Fatty Liver Disease: తీవ్రమైన కాలేయ వ్యాధి ‘ఫ్యాటీ లివర్’కి తొలిసారిగా ఔషధం రాబోతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారి కోసం డ్రగ్‌ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గురువారం ఆమోదించింది. మాడ్రిగల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ రూపొందించిన రెజ్డిఫ్రా అనే మందు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులకు సంబంధించిన తీవ్ర రూపమైన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)తో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది వ్యాధిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది.
గతంలో కాలేయ వ్యాధి NASH ఉన్న రోగులకు వ్యాధిని మెరుగుపరిచేందుకు సరైన మందులేదని ఎఫ్‌డీఏ అధికారి నికోలాయ్ నికోలోవ్ చెప్పారు. రెజ్ఢిఫ్రాని ఆమోదించడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనే వీలు కలిగింది. అమెరికాలో నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH) వల్ల 6-8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఈ వ్యాధి తరుచుగా అధిక రక్తకొవ్వు స్థాయిలు, టైప్ 2 మధుమేహం, ఊబకాయం వంటి ఇతర వ్యాధులతో సంబంధాన్ని కలిగి ఉంది.
Read Also: Petrol: ఎన్నికల వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ధరలు తగ్గించిన కేంద్రం
దీని వల్ల రోగి బలహీన పడటంతో పాటు తీవ్రమైన అలసట, చర్మ-కళ్లు పసుపురంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరి సిర్రోసిన్ అనే స్థితికి చేరి కాలేయ వైఫల్యం కూడా సంభవించవచ్చు. అలాంటి సమయాల్లో కాలేయ మార్పిడి అవసరమవుతుంది. నోటి ద్వారా తీసుకునే రెడ్డిఫ్రా మాలిక్యూల్‌ని రెస్మెటిరమ్ అని కూడా పిలుస్తారు. ఇది NASH యెక్క అంతర్లీన కారణాలను లక్ష్యం చేసుకుంటుంది. ఈ డ్రగ్‌ని రోగులు నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.
966 మంది వ్యక్తులపై 12 నెలల రీసెర్చ్ తర్వాత రెడ్డిఫ్రా తీసుకున్న వారు వ్యాధి నుంచి కోలుకున్నట్లు ఇటీవల న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. అయితే, ఈ డ్రగ్ వల్ల డయేరియా, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్లు గుర్తించారు. అమెరికన్ లివర్ ఫౌండేషన్ ఈ డ్రగ్‌ని ‘‘గ్రౌండ్ బ్రేకింగ్’’ చికిత్సగా ప్రశంసించింది. ఇది ఏప్రిల్ నెలలో అమెరికా రరోగుకు అందుబాటులోకి రానుంది. దాదాపు 15 ఏళ్ల పరిశోధనల ఫలితం ఈ డ్రగ్ అని మాడ్రిగల్ సీఈఓ బిల్ సిబోల్డ్ అన్నారు.