
CAA: పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) ప్రకారం అర్హులైన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే మొబైల్ యాప్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం.. ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా వెబ్సైట్ https://indiancitizenshiponline.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీఏఏ కింద దరఖాస్తులు చేయడానికి ‘CAA-2019’ మొబైల్ యాప్ పనిచేస్తుందని ప్రతినిధి తెలిపారు.
Read Also: CAA: సీఏఏపై అమెరికా గాయని ప్రశంసల వర్షం.. ఏమన్నారంటే?
అంతకుముందు, CAA కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వ్యక్తుల కోసం హోం మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి మార్గం సుగమం చేస్తూ CAA అమలు కోసం నియమాలు సోమవారం నోటిఫై చేయబడ్డాయి. సీఏఏ నిబంధనలను జారీ చేసిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్ 31, 2014 వరకు భారతదేశానికి వచ్చిన మూడు దేశాల నుంచి వేధింపులకు గురవుతున్న ముస్లిమేతర వలసదారులకు భారత జాతీయతను మంజూరు చేయడం ప్రారంభిస్తుంది. వీరిలో హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు ఉన్నారు.
ఈ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు – https://indiancitizenshiponline.nic.in