
SS Thaman Shared Pawan kalyan OG Poster: పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన జనసేన తరఫున అభ్యర్థులను ఫైనల్ చేసే పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఒకపక్క ఎలక్షన్ హడావుడి కొనసాగుతూనే ఉన్న మరొక పక్క పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
Pawan kalyan: పొలిటికల్ బూస్ట్ ఇచ్చేలా దిగుతున్న ఉస్తాద్.. రెడీ చేస్తున్న టీం!
ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి ప్రణాళికలు పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ షేర్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు ధరించి ఒక కత్తితో విలన్స్ ను నరికి ఆ రక్తంతో తడిసి ముద్దయినట్లు కనిపిస్తున్నాడు. ఒకరకంగా ఈ పోస్టర్ చూసి పవన్ ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి స్టఫ్ కదా మనకు కావాల్సింది అంటూ వారు మేకర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 2024 లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి
Woooowwww !! #OG
pic.twitter.com/nWVbtFpCCm
— thaman S (@MusicThaman) March 15, 2024