Leading News Portal in Telugu

Mamata Banerjee: మమత గాయంపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై నిరసనలకు పిలుపు



N

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో చేరి నుదిటకు కుట్లు కూడా వేసుకున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. అయితే ఇండియా కూటమిలో ఉన్న సభ్యులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

అయితే మమతా బెనర్జీ గాయంపై బీజేపీ నేత సువేందు చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడ్డారు. బీజేపీ తీరునకు నిరసనగా శనివారం ర్యాలీలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు తృణమూల్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

శుక్రవారం తోపులాటలో మమత కిందపడడంతో మమత నుదిటకు గాయమైనట్లు తెలుస్తోంది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను మమత ప్రకటించారు. విస్తృతంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కూడా ఒంటరిగానే బరిలోకి దిగారు.