Leading News Portal in Telugu

Rashmika Mandanna : రష్మిక ఫారిన్ కు వెళ్తే ఏం కొంటుందో తెలుసా?



Rashmikaa (5)

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇక వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తుంది.. సినిమాలతో పాటుగా ఫారిన్ ట్రిప్ లకు వెళ్తుంది.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది..

ఈ అమ్మడు ఫారిన్ టూర్ లకు వెళ్లిన ప్రతిసారి ఏదోకటి కొనడం అలవాటు.. అందరు హీరోయిన్లు మాములుగా ఫారిన్ కు వెళ్ళినప్పుడు ఏదైనా ఖరీదైన వాచ్ లు, డ్రెస్సులు కొంటారు కానీ రష్మిక మాత్రం ఏం కొంటుందో తెలుసా? అందమైన టెడ్డీ బేర్స్ కొనుక్కుంది.. ఇదేంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే ఆమెకు అందమైన బొమ్మాలను కలెక్ట్ చెయ్యడం చాలా ఇంట్రెస్ట్ అని గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది..

ఇక ఇటీవల రష్మిక మందన్న జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత అలాగే ఆస్ట్రేలియాకు కూడా వెళ్ళింది. విదేశాలను తన అభిమానులను కలిసి సందడి చేసింది.. ఆ దేశాల్లో రష్మిక మందన్న తన ఎంతో ఇష్టమైన టెడ్డిస్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమా తో పాటు పలు సినిమాలు చేస్తుంది.. బాలీవుడ్ రెండు ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం…

Whatsapp Image 2024 03 15 At 8.12.37 Pm