
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు సుమారు 3 గంటలకుపైగా తనిఖీలు చేసిన అనంతరం.. అరెస్ట్ చేశారు. కాగా.. కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఈడీ సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
Kejriwal: ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు
ఇదిలా ఉంటే.. కవిత ఇంట్లో ఈడీ రైడ్స్ చేస్తున్నారని తెలుసుకుని.. కేటీఆర్, హరీష్ రావు కవిత ఇంటికి వచ్చారు. కవిత అరెస్ట్ విషయాన్ని ఈడీ అధికారులు.. కుటుంబ సభ్యులకు తెలిపారు. మరికొందరు బీఆర్ఎస్ నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కవితను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు రాత్రి 8.45 ఫ్లైట్ బుక్ చేశారు ఈడీ అధికారులు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాన కవిత నివాసానికి చేరుకున్న ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం.. అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు.. కవిత అరెస్ట్ నేపథ్యంలో తన నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నినాదాలు చేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Chicken : చికెన్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి..