Leading News Portal in Telugu

Pawan Kalyan: జనసేన పొలిటికల్ యాడ్.. అస్సలు ఇలా ఉంటుందని ఊహించి ఉండరు



Janasena

Pawan Kalyan: ఇప్పటివరకు ఎన్నో పొలిటికల్ యాడ్స్ చూసే ఉంటారు. అన్నింటిలో ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. మమ్మల్ని గెలిపించండి అనో.. లేకపోతే గ్రామాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి తమ పార్టీ గుర్తును చూపించి.. అప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి. రేపు తాము గెలిస్తే ఎలా అంటుంది అని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రజలు చాలా చూసారు. ఇక తాజాగా జనసేన పొలిటికల్ యాడ్ చాలా వైరైటీ గా ఉంది. అందులో పవనే నటించడం విశేషం. ఎలాంటి గందరగోళం లేకుండా.. అర్థవంతంగా ఉన్న ఈ యాడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ యాడ్ లో పవన్ .. ఒక రూమ్ లో ఫ్యాన్ స్విచ్ వేయగానే.. టేబుల్ మీద ఉన్న పేపర్స్ అన్ని చెల్లాచెదురుగా పడిపోతాయి. వెంటనే పవన్.. ఫ్యాన్ ఆపేసి.. ఆ పేపర్స్ ను ఏరుతుంటాడు. ఒక్కో పేపర్ పై ఒక్కో పేరు రాసి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ఇసుక పాలసీ, లా అండ్ ఆర్డర్, వ్యవసాయం, నిరుద్యోగం.. ఇలా గాలికి ఎగిరిన పేపర్స్ అన్ని తీసుకొని పవన్.. వాటిని టేబుల్ పై పెట్టి.. దాని మీద గాజు గ్లాస్ పెడతాడు. అలా పెట్టాక.. చైర్ వద్దకు వెళ్లి నిలబడతాడు. ఇదే యాడ్ లో చూపించింది. ఇక ఈ యాడ్ చూడడానికి సింపుల్ గా ఉన్నా.. ఎంతో మీనింగ్ ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక కొంతమంది అయితే.. జనసేన పొలిటికల్ యాడ్.. అస్సలు ఇలా ఉంటుందని ఊహించిలేదు అని, బెస్ట్ క్యాంపైన్ యాడ్ అంటే ఇలా ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ యాడ్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఎలక్షన్స్ లో పవన్ గెలుస్తాడా.. ? లేదా ..? అని చూడాలి.