Leading News Portal in Telugu

One Nation One Election: ఒకే దేశం ఒకే ఎన్నిక.. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా..?



One Nestion

Election Commission: ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. 18,626 పేజీల ఈ నివేదికలో లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించి ఒకే ఓటరు జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను కలిపి నిర్వహిస్తే 8 వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుందని ఎన్నికల కమిషన్‌ పోల్‌ ప్యానెల్‌ ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టంగా చెప్పింది. కేవలం ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల కొనుగోలుకు మాత్రమే ఈ ఖర్చు అవుతుంది.

Read Also: Lok Sabha Election 2024 : ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే వేటిపై నిషేధం విధిస్తారంటే ?

అయితే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటైన కమిటీ 161 ​​రోజుల పాటు పలు రాజకీయ పార్టీలతో చర్చలు జరిపింది. అదే క్రమంలో ఫిబ్రవరి 20న ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసి అభిప్రాయాలు కోరింది. ఎన్నికల సంఘం కూడా కోవింద్ కమిటీకి నిధుల అవసరాన్ని తెలియజేసింది. ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని 17 మార్చి 2023న లా కమిషన్‌కు చెప్పింది. ఇక, ఈవీఎంలు లేదా ఉద్యోగులలో స్థానిక సంస్థల ఎన్నికలను చేర్చలేదని ఎన్నికల సంఘం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఉంది. ఎన్నికల ప్రక్రియను మార్చాలంటే మొత్తం వ్యవస్థలో పెను మార్పులు అవసరమని ఎన్నికల సంఘం పేర్కొంది.

Read Also: Health Tips : పళ్ళను శుభ్రం చెయ్యడానికి పేస్ట్ను వాడుతున్నారా? ఇది మీకోసమే..

ఇక, 2023 మార్చిలో ఓటింగ్ బూత్‌లను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. 2019లో 10.38 లక్షల పోలింగ్ బూత్‌లు ఉండగా.. 2024 నాటికి 11.93 లక్షలకు పెంచాలి అని తెలిపింది. పోలింగ్ బూత్‌ల సంఖ్య పెరగడం వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అవసరం అవుతాయి. కేంద్ర బలగాల సిబ్బంది సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది.. భద్రతా బలగాల సంఖ్యను కనీసం 50 శాతం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, అసెంబ్లీ- లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఈ సంఖ్య మరింత పెరగనుంది అని ఈసీ వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే రెండు సంస్థలైన బీఈఎల్, ఈసీఐఎల్‌లకు కూడా సమయం కావాలని ఎన్నికల సంఘం తెలిపింది. దాదాపు 53.57 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 38.67 లక్షల కంట్రోల్ యూనిట్లు, 41.65 లక్షల VVPATలు అవసరమవుతాయని అంచనా.. ఇందు కోసం దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేయనుంది.