Leading News Portal in Telugu

MP K.Laxman : ఢిల్లీ పెద్దల్లో కూడా మాధవిలతపై అపారమైన నమ్మకం కలిగింది



K Laxman

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన హైదరాబద్ పార్లమెంట్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు.. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపల్ల మాధవీలత, డా. లక్ష్మణ్ ఎంపీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొదటి జాబితాలోని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించారని, ఈ సారి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సంచలనమైన మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ పెద్ధల్లో కూడా మాధవి లత పై అపారమైన నమ్మకం కలిగిందని, ఈ రోజే ఎన్నికల నగారా మోగిందన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పని చేయాలని, గెలుస్తామని ధీమా తో బరిలో దిగాలి అని సూచిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో గెలువలేదు అనే విషయాన్ని మర్చిపోండని, మోడీ గాలి ఎలా వస్తుందో ఇప్పుడు అర్థం అవుతుందన్నారు.

అంతేకాకుండా..’ఉత్తర ప్రదేశ్ గత పరిస్థితి అందరికీ తెలుసు.. రౌడీ మాఫియా తో అనేక ఇబ్బంది ఎదుర్కున్న ఉత్తర ప్రదేశ్ నేడు బీజేపీ పరిపాలనలో ఎలా మారిందో చూస్తున్నాం.. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ మారింది.. మొత్తం దేశం మొత్తం నాలుగు కోట్ల ఇండ్లు కట్టిస్తే.. కేవలం ఉత్తర ప్రదేశ్ లో 50 లక్షల ఇండ్లు యోగి నిర్మించి ఇచ్చాడు.. ఉత్తర ప్రదేశ్ లో కూడా హైదరాబద్ పార్లమెంట్ ను మించిన మైనార్టీలు ఉన్న రాంపూర్, హాజింపుర్ నియోజకవర్గాలు ఉన్నాయి.. అక్కడ ఆ రెండు స్థానాల్లో బిజెపి గెలిచి రికార్డ్ సృష్టించింది.. అంటే అక్కడ ఉన్న ముస్లింలు కూడా బిజెపి తోనే ప్రశాంతంగా అంటామని భావించారు.. ఓవైసీ వల్ల హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పేద ముస్లిం లు కూడా అనేక ఇబ్బంది ఎదుర్కుంటున్నారు.. ఓల్డ్ సిటీ కి మెట్రో రాకుండా అడ్డుకుంది ఓవైసీ లే..

 

మెట్రో వచ్చి ఓల్డ్ సిటీ భాగు పడితే ఓవైసీ చేతి నుండి ఓల్డ్ సిటీ జారిపోతుందని వారి భయం.. మత పరంగా రెచ్చగొట్టి వారిని వాడుకుంటున్నారు తప్ప వారిని భాగుపర్చాలనే ఆలోచన లేదు.. ముస్లిం మహిళలు ఎదుర్కుంటున్న ట్రిపుల్ థలాక్ ను రద్దు చేసి వారికి గొప్ప మేలు చేసిన వ్యక్తి మోడీ.. అసాధ్యం అనుకున్న రామ మందిరాన్ని నిర్మించిన ఘనత మోడీ గారిది.. ఆర్థికంగా ప్రపంచంలో మన దేశాన్ని ఐదోవ స్థానం లో ఉంచాడు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రధాని పని చేసినా కూడా ఒక్క అవినీతి మచ్చ లేని వ్యక్తి.. కనీసం విపక్షాల నేతలు సైతం మోడీ పై అవినీతి ఆరోపణ చేయలేని స్థితిలో ఉన్నాడు.. పేదరికం నుండి వచ్చిన మోడీ గారు పేద వారి కోసం పని చేస్తున్నారు.. గతంలో అవాయంగా రాజీవ్ గాంధీ నే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు పేర్కొన్నాడు.. తన హయాంలో డిల్లీ నుండి ఒక్క లబ్ధి ధారునికి చేరాలంటే 85 శాతం మధ్య వర్తులు కమిషన్ తీసుకునే వారని చెప్పాడు..’ అని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.