
పార్టీ అధినాయకత్వం ఏం చెబితే అది చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు తెలిపారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తా.. పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరించాలని చంద్రబాబు చెప్పారు.. తాను సరేనన్నానని పేర్కొన్నారు. చీపురుపల్లా ఎంపీనా.. లేక ఎచ్చెర్ల అనేది కాదు.. ఏం చెబితే అది చేస్తానన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ కొన్ని శక్తులు ఉంటాయి.. దాని గురించి తానేం మాట్లాడనని తెలిపారు. ఓసారి ముందు ప్రకటించొచ్చు.. ఓసారి చివర్లో ప్రకటన రావచ్చని పేర్కొన్నారు.
CM Revanth: తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటాను..
తనకు ఇంకా టిక్కెట్ రాలేదనే దానిపై కొందరు అపొహలు సృష్టిస్తున్నారని కళా వెంకట్రావు చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు, పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానన్నారు. తనకు హోం మంత్రి పదవిచ్చినా.. ఇతర మంత్రి పదవిచ్చినా తనకు ముందుగా ఏం చెప్పలేదని పేర్కొన్నారు. రాజ్యసభ కూడా అదే విధంగా తనకు కట్టబెట్టారని తెలిపారు. ఎవరెన్ని అపొహలు సృష్టించినా.. కార్యకర్తలు కన్ఫ్యూజ్ కావొద్దని చెప్పారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటించాను.. ఆరేళ్లు పార్టీ ఏపీ అధ్యక్షునిగా పని చేశానన్నారు. తన సహచరులు, అనుచరులు తొణకొద్దు.. బెణకొద్దని కళా వెంకట్రావు సూచించారు.
Omar Abdullah: ప్రధాని మోడీపై వ్యక్తిగత దాడి మనల్నే దెబ్బతీస్తోంది..
టీడీపీ రెండో జాబితాలో కళా వెంకట్రావు పేరు లేదు. కళా వెంకట్రావు టీడీపీలో చాలా సీనియర్. ఆయన ఎన్టీఆర్ టైం నుంచే పార్టీలో కొనసాగుతున్నారు. అప్పుడే ఆయన హోం మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కళా వెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉంటూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉంటూ గత ఎన్నికల్లో ఓడిపోయారు. అలాంటిది అతనికి సీటు దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.