Leading News Portal in Telugu

MP Arvind : పాకిస్తాన్ వాతావరణాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో క్రియేట్ చేశారు



Mp Aravind

పాకిస్తాన్ వాతావరణాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో క్రేయేట్ చేశారన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన ఆర్మూరులో మాట్లాడుతూ.. ముస్లింలతో కలిసి ప్రధాని మోడీని హేళన చేసి మాట్లాదారని ఆయన మండిపడ్డారు. హిందూ వ్యతిరేకి జీవన్ రెడ్డి అని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అండతోనే పిఎఫ్ఐకి జగిత్యాల అడ్డా గా మారిందని ఆయన ఆరోపించారు. హిందూ వ్యతిరేక శక్తి గా తయారయ్యారని, రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వాలని జీవన్ రెడ్డి పోరాడటం విడ్డూరమన్నారు ఎంపీ అరవింద్‌. స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ హిందువులను మోసం చేస్తూ వస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా విభజన చేశారని, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు అనేక అరాచకాలు చేశారని ఆయన మండిపడ్డారు. అమాయకులపై పిడి యాక్టులు పెట్టి వేదించారని, కవిత అరెస్ట్ అవినీతి రహిత పాలనకు ప్రయోజనమన్నారు ఎంపీ అరవింద్‌. లిక్కర్ స్కామ్ లో లింక్ ఉంది కాబట్టే కవిత అరెస్ట్ అవుతారనని చెప్పామన్నారు. కవిత అరెస్ట్ తో బీజేపీ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Actor Arrest : లైంగిక వేధింపుల కేసులో 79 ఏళ్ల నటుడు అరెస్ట్..!