Leading News Portal in Telugu

YSRCP MP Candidates List: వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌.. ఎంపీ అభ్యర్థులు వీరే..



Ysrcp Mp Candidates List

YSRCP MP Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను విడుదల చేసింది.. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముందుగా నివాళులర్పించి.. ఆ తర్వాత పార్టీ నేతలతో కలిసి లిస్ట్‌ విడుదల చేశారు.. ఈ మీడియా సమావేశంలో.. ఎంపీ అభ్యర్థుల జాబితా, వివరాలను ఎంపీ నందగాం సురేష్ ప్రకటిస్తే.. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు విడుదల చేశారు.. 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే ఎంపిక చేశారు సీఎం వైఎస్‌ జగన్.. ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు ఉంటే.. 25 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు, ఒక చార్టెడ్‌ అకౌంటెంట్‌, ఒకరు మెడికల్‌ ప్రాక్టిషనర్‌ ఉన్నారు.

వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు.. లోక్‌సభ నియోజకవర్గం వివరాల్లోకి వెళ్తే..
1. శ్రీకాకుళం – పేరాడ తిలక్‌ (బీసీ)
2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌ (బీసీ)
3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ (బీసీ)
4. అనకాపల్లి –
5. అరకు – చెట్టి తనూజరాణి (ఎస్టీ)
6. కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌ (ఓసీ)
7. అమలాపురం – రాపాక వరప్రసాద్‌ (ఎస్సీ)
8. రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు (బీసీ)
9. నర్సాపురం – గూడూరి ఉమాబాల (బీసీ)
10. ఏలూరు – కారుమూరి సునీల్‌ కుమార్‌ (బీసీ)
11. మచిలీపట్నం- సింహాద్రి చంద్రశేఖర్‌రావు (ఓసీ)
12. విజయవాడ – కేశినేని నాని (ఓసీ)
13. గుంటూరు – కిలారి వెంకట రోశయ్య (ఓసీ)
14. నర్సరావుపేట – అనిల్‌ కుమార్‌ యాదవ్‌ (బీసీ)
15. బాపట్ల – నందిగాం సురేష్‌ (ఎస్సీ)
16. ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి (ఓసీ)
17. నెల్లూరు- వేణుంబాక విజయసాయిరెడ్డి (ఓసీ)
18. తిరుపతి- మద్దిల గురుమూర్తి (ఎస్సీ)
19. చిత్తూరు – రెడ్డప్ప (ఎస్సీ)
20. రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి (ఓసీ)
21. కడప- వైఎస్‌ అవినాష్‌రెడ్డి (ఓసీ)
22. కర్నూలు -బీవై రామయ్య(బీసీ)
23. నంద్యాల- పోచ బ్రహ్మానందరెడ్డి (ఓసీ)
24. హిందూపుర్‌- జోలదరసి శాంత (బీసీ)
25. అనంతపురం- మాలగుండ్ల శంకర నారాయణ (బీసీ)