Leading News Portal in Telugu

Chandrababu: ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా..



Babu

ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని వెల్లడించారు. మోడీ భారత దేశాన్ని విశ్వ గురుగా మారుస్తున్నారన్నారు. ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారని చంద్రబాబు తెలిపారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారని చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారన్నారు. ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారన్నారు.

Read Also: PM MODI : వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మోడీ..!

వికసిత్ భారత్ మోడీ కల.. వికసిత్ ఏపీ మనందరి కల కావాలి: చంద్రబాబు
వికసిత్ భారత్ మోడీ కల.. వికసిత్ ఏపీ మనందరి కల కావాలని చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న మోడీకి మేం అండగా ఉంటామన్నారు. దేశాన్ని జీరో పావర్టీ నేషన్‌గా చేయడం మోడీ వల్లే సాధ్యమన్నారు. 2014-19 మధ్య కాలంలో ఏపీలో 11 కేంద్ర సంస్థలను తెచ్చామన్నారు. మోడీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన జరిగిందన్నారు. ఐదేళ్లల్లో ప్రజల జీవితాల్లో ఆనందమే లేదన్నారు. గంజాయి సరఫరా, వినియోగం పెరిగిందని విమర్శించారు. విధ్వంసమే జగన్ విధానంగా ఉందని విమర్శించారు. ఏపీ పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నారని ఆరోపించారు. ఇద్దరు చెల్లెళ్లను కూడా జగన్ మోసం చేశారని ఆరోపణలు చేశారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని.. జగనుకు ఓటేయొద్దని జగన్ చెల్లెళ్లే చెప్పారన్నారు. బ్యాడ్ గవర్నెన్స్ వల్ల ఏపీ నష్టపోయిందన్నారు. లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారని, ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారని.. ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. కేంద్రంలో ఎన్డీఏకు 400+ స్థానాలు రావడం ఖాయమన్నారు. ఏపీలో 25 ఎంపీ స్థానాలను గెలవాలని.. గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Read Also: Manisha Koirala: నా భర్తే నాకు శత్రువయ్యాడు..పెళ్ళైన ఆరు నెలలకే..