
గత ఎన్నికల్లో గోశామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక నార్త్ ఇండియన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్ నిర్ణయించారని… ఆ నిర్ణయం మేరకే నంద కిషోర్ వ్యాస్ ( బిలాల్ ) కు టికెట్ కేటాయించారని గోశామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎమ్.ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రచారంలో కూడా కేటీఆర్ రెండు సార్లు నియోజకవర్గంలో ప్రచారం చేశరని గుర్తు చేశారు. అయితే నందు బిలాల్ అసమర్థత వల్ల గెలిచే సీటు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు.
Read Also: PM Modi: వికసిత్ భారత్ మాత్రమే కాదు.. వికసిత్ ఏపీ మా లక్ష్యం
అయినా.. పార్టీ గెలుపు కోసం తాము ఎంతో కృషి చేశామని, దాని ఫలితంగానే 60 వేలకు పైగా ఓట్లు తమకు పడ్డాయని ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపారు. స్వార్ధ రాజకీయ నాయకుడైన బిలాల్.. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో వెంటనే పార్టీని మారారని విమర్శించారు. గతంలో తాను ఓడిపోతే రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతామనని బిలాల్ మాట్లాడరన్నారు. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం అధికార పార్టీలో చేరిన బిలాల్ పట్ల.. నియోజకవర్గ ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి విమర్శనాస్త్రాలు..
తనకు ముఖ్యమంత్రి తెలుసు.. మంత్రులు తెలుసు అని మళ్ళీ మాయమాటలు చెప్తాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అతని పట్ల అప్రమత్తంగా ఉండాలని… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఆయన పనులు ఉంటాయని ఆనంద్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ ను వీడినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని.. బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము పని చేస్తామని ఆనంద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.