Leading News Portal in Telugu

YV Subbareddy: ఎన్ని పార్టీలు ఏకమైనా విజయం వైసీపీదే..



Yv Subbareddy

YV Subbareddy: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేతలు ఘాటు వ్యాఖ్యులు చేస్తున్నారు. ఈ సారి గెలుపు వైసీదేనని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వలేదని.. గతంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. ప్రజలు మా పక్షానే ఉన్నారన్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధైర్యంగా చెబుతున్నామన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా విజయం వైఎస్ఆర్సీపీదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాబలం లేకనే ఒకటికి రెండుసార్లు తిరుగుతూ పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. క్రిడిబులిటీ లేని సంస్థల సర్వేలను ప్రజలు విశ్వసించరన్నారు.