
Indian IT CEOs: ప్రస్తుతం సమాజంలో ఐటీ జాబ్ అంటే చాలా క్రేజ్ ఉంది. చివరకు తల్లిదండ్రులు వారి కుమార్తెల పెళ్లి చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్షన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నెలకు లక్షల్లో జీతాలు, ఆకర్షించే వార్షిక ప్యాకేజీలు ఐటీ జాబ్‌లకు ప్రధాన ఆకర్షణ. సాధారణ ఉద్యోగి లక్షల్లో జీతాన్ని సంపాదిస్తుంటే, ఇక ఐటీ సంస్థల సీఈఓల జీతం ఎంత ఉంటుందనే ఆసక్తి అందరికి కలుగుతుంది. కంపెనీల అభివృద్ధిలో వీరు కీలకంగా వ్యవహరిస్తుంటారు.
ప్రస్తుతం దేశంలో టాప్-6 ఐటీ కంపెనీల సీఈఓలను వేతనాలను పరిశీలిద్దాం.
విప్రో: గ్లోబల్ ఐటీలో కంపెనీ మార్కెట్, స్థాయిని ప్రతిబింబిస్తూ ఈ సంస్థ సీఈఓ రూ.82.41 కోట్ల ఆకట్టుకునే జీతం తీసుకుంటూ అగ్రస్థానంలో ఉన్నారు.
ఇన్ఫోసిస్: మరో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ సీఈఓ రూ. 56.45 కోట్ల జీతం తీసుకుంటున్నారు.
టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్): టీసీఎస్ సీఈఓ రూ. 29.16 కోట్ల సాలరీని తీసుకుంటున్నారు.
టెక్ మహీంద్రా: రూ. 32 కోట్ల ఆకర్షీయణీయమైన సాలరీ ప్యాకేజీతో టెక్ మహీంద్ర సీఈవో నాలుగో స్థానంలో ఉన్నారు.
హెచ్‌సీఎల్ టెక్: మరో టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ సీఈఓ రూ. 28.4 కోట్ల జీతాన్ని తీసుకుంటున్నారు.
L&T మైండ్‌ట్రీ: L&T మైండ్‌ట్రీ సీఈఓ రూ. 17.49 కోట్ల జీతాన్ని తీసుకుంటున్నారు.