Leading News Portal in Telugu

WPL 2024 Final: బౌలింగ్‌తో ఆకట్టుకున్న శ్రేయాంక.. 113 పరుగులకే ఢిల్లీ ఆలౌట్



Wpl 2024 Final

WPL 2024 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిష‌న్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అనూహ్యంగా ఫైనల్‌కు చేరిన బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఢిల్లీ జట్టును కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు జట్టు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫలితంగా 113 పరుగులకే ఢిల్లీ ఆలౌట్ అయింది. ఓపెనర్లు మెగ్ లానింగ్ (23), షెఫాలి వర్మ (44) మినహా ఎవరూ రాణించలేదు. వికెట్‌ నష్టపోకుండా పవర్‌ ప్లేలో 61 పరుగులు చేసిన దిల్లీకి సోఫీ మోలినక్స్ షాకిచ్చింది. 8 ఓవర్‌లో ఏకంగా వరుసగా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం వికెట్ల పతనం ఆగలేదు. . కేవలం 4 డీసీ బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు పడగొట్టింది. అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శన తర్వాత ఆర్సీబీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మంధాన నేతృత్వంలోని జట్టు 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది.