Leading News Portal in Telugu

Strawberries: స్ట్రాబెర్రీ తిని 8 ఏళ్ల బాలుడి మృ‌తి..



Strawberry

Strawberries: స్ట్రాబెర్రీలు తిని 8 ఏళ్ల బాలుడు మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్‌లో సేకరించిన స్ట్రాబెర్రీలు తిని తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కెంటుకీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెంటకీలోని మాడిసన్‌విల్లే నార్త్ హాప్‌కిన్స్ హైస్కూల్‌లో అతను ముందు రోజు సేకరించిన స్ట్రాబెర్రీలు తిన్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.

Read Also: Sandeshkhali: “అర్థరాత్రి బలవంతం చేసేవాడు, కొట్టేవాడు”..వెలుగులోకి టీఎంసీ మాజీ నేత ఆగడాలు..

దీని తర్వాత బాలుడి శరీరంపై దద్దుర్లుతో సహా పలు అలెర్జీ లక్షణాలు చూశామని తెలిపారు. అంతకంతకు లక్షణాలు తీవ్రమవుతూనే ఉన్నాయని, ఇంటికి తీసుకెళ్లే ముందు బాలుడిని సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు నిద్ర లేపే సరికి స్పందించకపోవడంతో అధికారులకు ఫోన్ చేశామని కుటుంబీకులు తెలిపారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వారు తేల్చారు. హాప్‌కిన్స్ కౌంటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రాథమిక శవపరీక్ష నివేదిక ‘‘ ఐసోలేటెడ్ అలెర్జీ రియాక్షన్’’గా నిర్ధారించింది.

మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ క్రిస్టోఫర్ కీఫెర్ మాట్లాడుతూ.. ఇది అలెర్జీ రియాక్షన్‌లా కనిపిస్తోందని చెప్పారు. హాప్కిన్స్ కౌంటీ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డెసిస్ బీచ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్ట్రాబెర్రీలను తినవద్దని కోరారు. బాలుడికి స్ట్రాబెర్రీ అలెర్జీ ముందుగా ఉందో లేదో అధికారులు చెప్పలేదు. ప్రస్తుతం స్ట్రాబెర్రీల నమూనాలను పరీక్షల కోసం పంపారు.