Leading News Portal in Telugu

Hyderabad Rain: హైదరాబాద్‌లో అక్కడక్కడ చిరుజల్లులు



Rain In Hyderabad

Hyderabad Rain: హైదరాబాద్‌లో అక్కడక్కడ వర్షం కురిసింది. మొజంజాహీ మార్కెట్, నాంపల్లి, లకిడికపూల్, ఖైరతాబాద్, పటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాల ఉదయం వర్షం కురిసింది. నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు గ్రేటర్‌లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, ద్రోణి ప్రభావంతో చల్లబడిన నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేశారు.

Read also: Yadagirigutta: లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు తిరు కల్యాణ మహోత్సవం..

ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, కుమురభీం ఆసిఫాబాద్‌, నల్గొండ, వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. జోగుల గంబద్వాల, వనపర్తి. , నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలు వస్తాయి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈరోజు చలి వాతావరణం ఉంటుందని, పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు, గాలిలో తేమ 46 శాతం నమోదైందని అధికారులు తెలిపారు.
RS Praveen Kumar: నేడు బీఆర్‌ఎస్‌ లోకి ఆర్‌ఎస్పీ.. నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ..