Leading News Portal in Telugu

IPL 2024: శ్రేయస్‌ అయ్యర్‌కు ఎన్సీఏ లైన్‌ క్లియర్‌.. మెలిక పెట్టిన డాక్టర్..



Iyer

IPL 2024: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేషనల్ క్రికెట్ ఆకాడమీ శుభవార్త చెప్పింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆడేందుకు ఆ టీమ్ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు అధికారికంగా ఎన్‌సీఏ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఎన్‌సీఏ సలహా మేరకు అయ్యర్‌ ముంబైలోని వెన్నె ముక నిపుణుడిని సంప్రదించగా.. అతను అయ్యర్‌కు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. సదరు వెన్నెముక డాక్టర్ అయ్యర్‌కు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తూనే ఓ మెలిక కూడా పెట్టినట్లు తెలుస్తుంది.

Read Also: Virat Kohli: ఆర్సీబీ టీమ్తో జతకట్టిన కోహ్లీ.. ప్రాక్టీస్ స్టార్ట్ చేసేశాడుగా..

కాగా, గత కొంత కాలంగా వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతున్న కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ బంతిని డిఫెండ్ చేసే క్రమంలో కాలును ఎక్కువగా చాచ కూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఒక వేళ అయ్యర్‌ అలాంటి షాట్లు ఆడాల్సి వస్తే మాత్రం వెన్ను ముక సమస్య తిరగబెట్టే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది అని సమాచారం. శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను ముక సమస్య కారణంగా గత సీజన్‌ మొత్తానికి దూరమయ్యారు. ఇక, ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభంకాబోతుంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడబోతున్నాయి. అయితే, కేకేఆర్‌ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య పోటీ జరగనుంది.