Leading News Portal in Telugu

US: అమెరికాలో ఆంధ్రా విద్యార్థి అభిజిత్ అనుమానాస్పద మృతి



Us Student

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి అభిజిత్ (20) అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గతేడాది బోస్టన్ యూనివర్సిటీలో చేరాడు. తన స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తరగతులు ముగిసిన తర్వాత ఇంటికి రాకపోవడంతో ఫ్రెండ్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమీపంలోని ఓ కారులో మృతదేహాన్ని గుర్తించారు. అభిజిత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు భారత కాన్సులేట్ తెలిపింది.

అభిజిత్‌ను గుర్తుతెలియని దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడో చంపేసి అడవిలో కారులో వదిలేసినట్లుగా అనుమానిస్తున్నారు. హత్య వెనుక ప్రధాన ఉద్దేశం తెలియడం లేదు. డబ్బు లేదా ల్యాప్‌టాప్ కోసమో అభిజిత్‌ను చంపేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్ ఏకైక కుమారుడు. అభిజీత్ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు తల్లిదండ్రులు తొలుత ఇష్టపడలేదు. కానీ తర్వాత అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అంగీకరించారు. ఇంజనీరింగ్ సీటు రావడంతో బోస్టన్ యూనివర్సిటీలో గతేడాది జాయిన్ అయ్యాడు. అమెరికాలో అన్ని లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని గుంటూరు జిల్లా బుర్రిపాలెం తరలించారు.

ఇది కూడా చదవండి:Ravi Shankar Rathod: గుప్పెడంత మనసు మను.. హనుమాన్ సినిమాలో నటించాడని తెలుసా.. ?

అగ్రరాజ్యంలో ఈ మధ్య భారతీయులు హత్యకు గురవుతున్నారు. వేర్వేరు కేసుల్లో అమెరికా సంతతికి చెందిన భారతీయులు హత్యకు గురికావడం ఇది తొమ్మిదవది. తాజాగా ఒక విద్యార్థి మృతిచెందాడం భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అభిజిత్ మృతితో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధవులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి:Shane Watson: నేను పాకిస్థాన్ టీమ్కు కోచ్గా రాలేను.. ఎందుకంటే?