
YSRCP: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీజినల్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బస్సు యాత్ర, మేనిఫెస్టోతో పాటు ఎన్నికల ప్రచారంపై కీలకంగా చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 50 రోజుల పాటు నిర్వహించాల్సిన పార్టీ ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా ఈ మీటింగ్ లో చర్చించనున్నారు.
Read Also: MLA Rammohan Reddy: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది..
ఇక, సీఎం తన ఎన్నికల ప్రచార వ్యూహం మార్చారు. పోలింగ్‌కు 54 రోజుల సమయం ఉండటంతో ప్రచారం షెడ్యూల్ ను వైఎస్ జగన్ మార్చేశారు. టీడీపీ ఒత్తిడితోనే పోలింగ్ నాలుగో విడతకు వెళ్లిందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఎక్కువ సమయం తీసుకుని వైసీపీ మీద ఒత్తిడి పెంచేందుకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్లాన్ చేస్తుందని తెలుసుకున్నా వైసీపీ చీఫ్.. కూటమి ఎత్తుగడకు జగన్ రివర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక, 120 నియోజకవర్గాల్లో నిర్వహించాలనుకున్న సభలను బస్సు యాత్రలుగా మార్పు చేశారు. అలాగే, పోలింగ్ రోజు వరకు జనంలోనే ఉండాలని సీఎం జగన్ చూస్తున్నారు. అలాగే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక బహిరంగ సభ నిర్వహణతో పాటు స్థానికులతో కూడా జగన్ మాట్లడనున్నారు.