Leading News Portal in Telugu

Patlolla Karthik Reddy: కేసీఆర్ కు రంజిత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు ?



Patlolla Karthik Reddy

Patlolla Karthik Reddy: కష్టకాలం లో రంజిత్ రెడ్డి కి కేసీఆర్ కు అండగా ఉండాలి కానీ వెన్నుపోటు పొడుస్తారా? అంటూ బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరడం నయవంచన,దగా,వెన్నుపోటు అంటూ మండిపడ్డారు. రంజిత్ రెడ్డి కి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే తొలిసారి ఎంపీ అయ్యారని గుర్తు చేశారు. రంజిత్ రెడ్డి అన్ని విధాలా ఎదగడానికి బీఆర్ఎస్ కారణమని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరమవుతారా ? అని ప్రశ్నించారు. కష్టకాలంలో రంజిత్ రెడ్డి కి కేసీఆర్ కు అండగా ఉండాలి కానీ వెన్నుపోటు పొడుస్తారా ? అని మండిపడ్డారు. చేవేళ్ల ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ ను రంజిత్ రెడ్డి వంద కోట్ల రూపాయలకు కొన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Ex MLA Son Case: మళ్లీ తెరపైకి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు..

జెండా మోసిన తమకు అన్యాయం చేసి రంజిత్ రెడ్డి కి టికెట్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయని తెలిపారు. తనకు మరోసారి ఎంపీ గా పోటీ చేసే ఉద్దేశం లేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని రంజిత్ రెడ్డి చెబితే కేసీఆర్ నమ్మారన్నారు. కేసీఆర్ నమ్మకాన్ని రంజిత్ రెడ్డి వమ్ము చేశారని మండిపడ్డారు. రంజిత్ రెడ్డి కి ఈ సారి ఓటమి ఖాయమన్నారు. చేవెళ్లలో ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో నిన్న (ఆదివారం) చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దానం నాగేందర్‌కు కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఖరారు చేసింది. రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ నుంచి, పట్నం సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.
BRS Party: దానం పై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు