
మంగళవారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వీక్ డేస్, అలాగే పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో భక్తులు తిరుమలకి రావడం గణనీయంగా తగ్గారు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. సోమవారం నాడు శ్రీవారిని 65,051 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే 23,107 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.
Also read: Ntr : గోవాకు ఎన్టీఆర్.. న్యూ లుక్ అదుర్స్..!
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్ లై న్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు మరియు శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో భాగంగా మార్చి 18 – 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా కొరకు టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. అలాగే మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా అధికారులు విడుదల చేస్తారు. శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు అధికారులు.
Also read: Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
ఇక అంగప్రదక్షిణం టోకెన్లు మార్చి 23న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. భక్తులకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచారు అధికారులు. అలాగే తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.