
TS AP Rains: హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వరుణుడు చల్లబడ్డాడు. చల్లటి గాలులు, చిరు జల్లులు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఈ చలి మరో మూడు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం నుంచి ఎండలు మండుతున్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. చింతల్, ఐడీపీఎల్, షాపూర్ నగర్, గ్డిమెట్ల, సూరారం, పటాన్ చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్లో తేలికపాటి వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది.
రైతులు ఆవేదన..
మరోవైపు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. విర్నపల్లిలో వరి కోత దశలో ఉన్న పంట పొలాలపై ఆకాల వడగళ్ల వర్షానికివరి పంటలు నేల రాలాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో అన్నదాతను వర్షం ఆగం చేసింది. ఆకాలవర్షంతో వరి, మొక్కజొన్న, జొన్న పంటలు పలుచోట్ల నెలకొరిగాయి. ఈదురుగాలులకు మామిడి పంట రాలిపోయింది. పంట చేతికివచ్చే సమయానికి నేలపాలయ్యిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Jagan – Bulletproof Bus: జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు..!
ఏపీ వాతావరణం
ఏపీలో వాతావరణం చల్లబడింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రా వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎల్లుండి (మార్చి 20) ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
SSMB29 Update: స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.. సినిమాని వేగంగా పూర్తి చేస్తాం: రాజమౌళి