Leading News Portal in Telugu

Gadchiroli Encounter: భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి!



Encounter

4 Naxals killed in encounter with police in Gadchiroli: తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Sarfaraz-Dhruv Jurel: సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్‌కు జాక్‌ పాట్‌!

తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి మావోయిస్టులు ప్రవేశిస్తుండగా.. భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత, డీవీసీ సభ్యుడు వర్గీష్‌ ఉన్నాడు. డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ కూడా మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందినవారిగా గుర్తించారు. వీరిపై రూ.36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు సమాచారం.