
మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. అత్యంత కాలుష్య రాజధానిలలో ఒకటిగా మరోసారి లిస్ట్ లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిలలో మరోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను తాజాగా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారంగా చూస్తే మనదేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాల్గవసారి ఎంపికైంది.
Also Read: RRB Jobs 2024: రైల్వేలో 9144 టెక్నీషియన్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
ముఖ్యంగా ఢిల్లీలోని గాలి నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న రాజధాని అని చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ 2018 నుంచి వరుసగా నాలుగోసారి ఈ ర్యాంక్ ను సాధించింది. అదే విధంగా మరోవైపు బీహార్ రాష్ట్రములోని ‘బెగుసరాయ్’ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఎంపికైంది. కాలుష్య దేశాలు, నగరాల జాబితా ప్రకారం సగటు వార్షిక PM 2.5 గాఢతతో క్యూబిక్ మీటరుకు 54.4 మైక్రోగ్రాములుగా పేర్కొనగా అందులో.. 2023లో మూడో స్తానం దక్కించుకుంది. ఈ లిస్ట్ లో మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ లు ఉన్నాయి.
Also Read: Suicide Attempt in Flight: విమానంలో ప్రయాణికుడి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఇక ప్రతి ఏటా కాలుష్యం కారణంగా అనేక మంది ప్రజలు అనేక వాయు సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ల అకాల మరణాలకు వాయు కాలుష్యం కారణం అవుతుందని.. పీఎం 2.5కు గురికావడం వల్ల ప్రజలు అనేక తీవ్రమైన వాయు సమస్యల బారిన పడుతున్నారని వెల్లడించింది. అంతేకాకుండా కాలుష్యం ద్వారా ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు లాంటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 మరణాలలో ఒక మరణం వాయు కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయని తెలిపింది.